నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని లొంగన్ జీపీ గ్రామంలో శుక్రవారం ఎంపీడీఓ శ్రీనివాస్, ఎంపీఓ రాము గ్రామ సర్పంచ్ నాగలగిద్దే సదుపటేల్ సమక్షంలో ఇంటింటికి తిరిగి వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలను పంపిణీ చేశారని కార్యదర్శి మాధారావ్ తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపిఓ రాము మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటింటికీ మొక్కలు అందజేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలను పెంచి, రక్షించాలన్నారు.
– లొంగన్ జీపీ రికార్డులను తనిఖీ చేసేన ఎంపీడీఓ, ఎంపీఓ రాము: జీపీ గ్రామ పంచాయతీ కార్యాలయం 14 రకాల రికార్డులను ఎంపిడిఓ శ్రీనివాస్ , ఎంపిఓ రాము సంయుక్తంగా పరీశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. శానిటేషన్ పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, పన్నులు 100 శాతం వసులు చేయాలని, గ్రామ సమస్యలను పరిష్కరించాలని అన్నారు. గ్రామాంలోని ఖాళీ స్థలాలు ఆక్రమణలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని కార్యదర్శికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సదు పటేల్, జిపి కార్యదర్శి, జిపి కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



