Friday, July 17, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వర్షాల కోసం గ్రామదేవతలకు జలాభిషేకం

వర్షాల కోసం గ్రామదేవతలకు జలాభిషేకం

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్ 
మండలంలోని మహమ్మదాబాద్ జీపీ గ్రామంలో శుక్రవారం గ్రామ సర్పంచ్ సుర్నార్ శకుంతల బాలు ఆధ్వర్యంలో ప్రత్యేకంగా గ్రామ దేవతలకు జలాభిషేకం చేశారు . ఈ సందర్భంగా గ్రామస్తులు, వర్కారిలు, యువకులు, గ్రామ మహిళలు నిండు కుండలు నీటినీ తీసుకుని బోనాలతో గ్రామ దేవతలకు మొక్కులు తీర్చుకున్నారు. గ్రామస్తులు బాజాభజంత్రిలో ఊరేగింపుగా పండుగ వాతావరణంలో గ్రామస్తులు తరలివచ్చి గ్రామ దేవతలకు జలాభిషేకంతో పాటు నైవేద్యం సమర్పించారు. ఏడాది జూన్ మాసం నుండి వర్షాలు అంతంత మాత్రమే పడడంతో రైతులు ధైర్యంతో  వివిధ రకాల పంటలైన వాటిని వందలాది , వేలాది ఎకరాలలో విత్తుకోవడం  జరిగింది. అడపా గడప పడిన వర్షాలు ముడుతలు మొదలు పెట్టాయి కానీ వర్షాలు లేక గత నెల రోజులుగా రైతులు వరుణుడి కరుణ లేఖ పోవడం రైతులలో ఉన్న మదన పడుతున్న సందర్భాలు ఉన్నాయి. ఎకరానికి వేలాది రూపాయల పెట్టుబడి పెట్టి మంటలు అభివృద్ధిగా పండితాయే లేదా అని అనుమానాలకు రైతులు నెత్తినోరు కొట్టుకుంటున్నారు. అందుకే మండలంలోని రైతులు ఇబ్బందులలో ఎదుర్కోవడం జరుగుతుంది. గ్రామస్తులు మా కుమ్మడిగా కలిసి వరుణుడు కరుణించాలని మంచి పంటలు పండాలని రైతులు, అష్ట ఐశ్వర్యాలు సంపద,   సమృద్ధిగా గ్రామ రైతులకు ఆశీర్వదించాలని కోరుకుంటూ మొక్కులు తీర్చుకోవడం జరిగింది . ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శకుంతల తో పాటు ఉపసర్పంచ్ , భజన మండలి సభ్యుడు, మహిళలు, వార్కారిలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -