– లయన్స్ క్లబ్ సన్మాన సభలో ఎంఈఓ ఆంధ్రయ్య
నవతెలంగాణ-కమ్మర్ పల్లి
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు త్రిబుల్ ఐటీ బాసరలో సీట్లు సాధించడం గర్వకారణమని మండల విద్యాధికారి నేర ఆంధ్రయ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని మండల విద్యా వనరుల కేంద్రంలో గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి తమ ప్రతిభతో ట్రిపుల్ ఐటి బాసరలో సీట్లు సాధించిన విద్యార్థులను లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమానికి మండల విద్యాధికారి ఆంధ్రయ్య అధ్యక్షత వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుని కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులకు ధీటుగా ట్రిపుల్ ఐటి బాసరలో సీట్లు సాధించడం విద్యార్థుల కృషికి, ఉపాధ్యాయుల అంకితభావానికి నిదర్శనమన్నారు. సన్మానం పొందిన విద్యార్థులు మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించి, ఇతర విద్యార్థులకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ కమ్మర్ పల్లి అధ్యక్షులు తెడ్డు రమేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంలో లయన్స్ క్లబ్ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలిపారు.సన్మానం పొందిన విద్యార్థులు శాలిని, శ్రీజ, యెనుగందుల సౌమిత్, శ్రీనిత్, అభినయ్, సంధ్య లను లయన్స్ క్లబ్ ప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు శాలువాలు కప్పి, జ్ఞాపికలు అందజేసి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించిన లయన్స్ క్లబ్ ప్రతినిధులకు, ఉపాధ్యాయులకు, విద్యాశాఖ అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శి అహ్మద్ హుస్సేన్, కోశాధికారి సుంకరి విజయ్ కుమార్, మాజీ అధ్యక్షులు లుక్క గంగాధర్, మాజీ ప్రధాన కార్యదర్శి, సర్పంచ్ రేవతి గంగాధర్, క్లబ్ సభ్యులు పడిగేల ప్రవీణ్, బద్దం రాజశేఖర్, గోపిడి లింగారెడ్డి, పవన్, ఉప్లూర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజన్న, సిఆర్పిలు అంజయ్య, రాజేష్ ఎంఐఎస్ సురేందర్, తదితరులు పాల్గొన్నారు.



