Friday, July 17, 2026
E-PAPER
Homeక్రైమ్గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

- Advertisement -

నవతెలంగాణ-ఆలేరు టౌన్  
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆలోరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా నర్మేట మండలం మల్కాపటకు చెందిన బానోతు యాకూబ్ (50) తన స్వగ్రామం నుండి టీవీఎస్ ఎక్సెల్ పై హైదరాబాద్ వైపు వెళ్తున్న క్రమంలో బైపాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యూకూబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నట్టు పేర్కొన్నారు. మృతుడి భార్య బానోతు బుజ్జి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించామని సీఐ యాలాద్రి తెలిపారు. కాగా.. రహదారిపై మృతుడి బంధువులు తమకు న్యాయం చేయాలని ఆందోళనలకు దిగారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -