Saturday, July 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలువినూత్న కథ, కథనాలు..

వినూత్న కథ, కథనాలు..

- Advertisement -

వివిఫై మీడియా ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై, ఖాన్ దురాని, సాహితి ఆవంచ జంటగా నటించిన సినిమా ‘కళ్యాణం కమనీయం జీవితం. రవి లోకిరెడ్డి దర్శకత్వంలో పైలా ప్రసాద్ రావు, కిషోర్ గుండాల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంటున్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కు రెడీ అవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని రాజవంశీ రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ఈ చిత్ర టీజర్ లాంచ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. దర్శకులు వీఎన్ ఆదిత్య, రాంప్రసాద్, మల్లిడి సత్యన్నారాయణ రెడ్డి, జెమినీ సురేష్ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరోయిన్ సాహితి అవంచ మాట్లాడుతూ,'ఇది ఒక బ్యూటిఫుల్ ఫిలిం. మా సినిమా ప్లెజెంట్ గా ఉంటూనే చివరలో ఒక మంచి ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది అని తెలిపారు. ‘ఒక కొత్త తరహా కథ, కథనంతో మీ అందరినీ ఆకట్టుకుంటుందిఅని హీరో ఖాన్ దురాని చెప్పారు. ప్రొడ్యూసర్ కిషోర్ గుండాల మాట్లా డుతూ,'గతంలో 24 కిస్సెస్ సహా మరికొన్ని చిత్రాలు నిర్మించాను. ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాం. మరో సినిమా కూడా లైనప్ లో ఉంది. ప్రేక్షకులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి అని అన్నారు. డైరెక్టర్ రవి లోకిరెడ్డి మాట్లాడుతూ,’నా నిజ జీవితంలోని కొన్ని ఇన్సిడెంట్స్ కు ఫిక్షనల్ ఎలి మెంట్స్ జోడించి ఈ చిత్రాన్ని రూపొందించాను. చాలా మంచి లవ్ స్టోరీ ఇది. డ్రామా, సస్పెన్స్ ఎలిమెంట్స్ ఆకట్టుకుంటాయి` అని చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -