Friday, July 17, 2026
E-PAPER
Homeతాజా వార్తలుషాక్ ఇచ్చే ట్విస్ట్స్

షాక్ ఇచ్చే ట్విస్ట్స్

- Advertisement -

కొత్త కథతో, ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి కలిగించేలా తెరకెక్కు తున్న చిత్రం ‘తత్వం’. తాజాగా ఈ చిత్రంలోని ‘ఊపిరాంత ఇవాళ్లే ఊగేస్తుంది ఊయాలే’ అనే పాటను హీరో కిరణ్‌ అబ్బవరం తన సోషల్‌ మీడియా ఖాతా ద్వారా విడుదల చేశారు. చేతన భరద్వాజ్‌ బాణీలు అందిం చిన ఈ పాటకు భాస్కర భట్ల సాహి త్యాన్ని సమాకూర్చగా, అనురాగ్‌ కులకర్ణి ఆలపించారు. దినేష్‌ తేజ్‌, దష్విక.కె హీరో హీరో యిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అర్జున్‌ కోల దర్శకుడు. త్రయతి ఇషాని క్రియేషన్స్‌, ఎస్ ప్రొడక్షన్స్‌ సంయుక్త నిర్మాణంలో వంశీ సీమకుర్తి, శ్వేత పసుపులేటీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భం గా నిర్మాత మాట్ని డుతూ ,’మంచి ఎమోషనల్‌ కనెక్టీ విటీ ఉన్న థ్రిల్లర్ ఇది. సంగీ తానికి మంచి స్కోప్‌ ఉంది. ఈ పాట అందరికి నచ్చు తుంది. ఇటీవల విడుదలైన ట్రైలర్‌ అందరికి నచ్చింది. ఈ సినిమాలో అన్ని ఎలిమెంట్స్‌ కుదిరాయి. దర్శకుడు అర్జున్‌ కోలా అనుకున్న కథను మించి తెరకెక్కిం చాడు’ అని అన్నారు. దర్శకుడు అర్జున్‌ కోలా మాట్లా డుతూ,’సంగీతానికి స్కోప్ ఉన్న చిత్రమిది. చేతన్‌ భరద్వాజ్‌ కథకు తగ్గట్టుగా అద్భుతమైన ట్యూన్స్‌ ఇచ్చాడు. మన చుట్టు జరుగుతున్న ఇన్‌సిడెంట్స్‌ ఆధా రంగా తయారు చేసుకున్న కథ ఇది. కథ తప్ప కుండా అందరినీ ఎంగేజింగ్‌గా ఉంచుతుంది. దర్శకుడు వంశీ ‘అన్వేషణతరహాలోనే అందర్ని కట్టిపడేసే సినిమా ఇది అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -