కాటారం ఆర్డీఓ రవిందర్
నవతెలంగాణ – మల్హర్ రావు:-
ఓసీపీకి డేంజర్ జోన్లో ఉన్న ఇండ్లు,భూముల సర్వే పారదర్శకంగా నిర్వహించాలని కాటారం ఆర్డీఓ రవిందర్ సర్వే టీమ్స్ కు సూచించారు. శుక్రవారం మండల కేంద్రమైన తాడిచెర్లలోని తహశీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రవికుమార్ అధ్యక్షతన ఆర్డీఓ సర్వే టీమ్ సభ్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడారు డేంజర్ జోన్లో ఉన్న ప్రతి ఇంటికి సర్వే క్షుణ్ణంగా చేయాలన్నారు.టీమ్స్ ఎలాంటి వత్తిళ్లు, పైరవీలు లేకుండా విచారణను నిష్పక్షపాతంగా నిర్వహించాలని సూచించారు.డేంజర్ జోన్‌లో కొత్త,పాత తేడా లేకుండా ప్రతి ఇంటిని తనిఖీ చేసి చెక్‌లిస్ట్ ప్రకారం కుటుంబ వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని సూచించారు.ప్రతిరోజు పూర్తి చేసిన ఫారాలను కాటారం ఆర్డిఓ కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు
తాడిచెర్ల డేంజర్ జోన్లో సర్వే పారదర్శకంగా నిర్వహించాలి.
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES


