అన్నపూర్ణ స్టూడియోస్, ఎపిక్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మి స్తున్న వినూత్న చిత్రం ‘పళ్ళ బురుసు’ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు.
ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. తెలుగు సంస్కృతి, ప్రాంతీయతను ప్రతిబింబించే ఈ చిత్రం వినోద భరితమైన కామెడీ-డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తండ్రీకొడుకులుగా ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, ప్రజ్వల్, గోమతి రెడ్డి, కిరణ్ మాచా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్‌లో జిల్లా కోర్టు ఆవరణలో పెద్ద టూత్‌బ్రష్‌ను త్రాసులా రూపొందించి, దానిపై వెన్ను వెన్నుకు ఆనుకుని కూర్చున్న ఇద్దరు ప్రధాన పాత్రధారులను చూపించడం ఆకట్టుకుంది. ఈ వినూత్న విజువల్ సినిమా కథపై ఆసక్తిని రేకెత్తిస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతోంది.ఈ చిత్రానికి ఉదయ్ చౌహాన్ కథ, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి ఆదిత్య పిట్టీ, వివేక్ కృష్ణాని (ఎపిక్ స్టూడియోస్) నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
ఆద్యంతం వినోదభరితం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



