Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయంతుపాకీ గాయాలతో పౌరుడి మృతి

తుపాకీ గాయాలతో పౌరుడి మృతి

- Advertisement -

జమ్మూకాశ్మీర్‌‌లోని దోడ జిల్లాలో ఘటనఇద్దరు భద్రతా సిబ్బందికి గాయాలు
శ్రీనగర్‌ : జమ్మూకాశ్మీర్‌‌లో దోడ జిల్లాలో తుపాకీ గాయాలతో ఒక సాధారణ పౌరుడు మృతి చెందడం సంచలనంగా మారింది. ఇదే ఘటనలో స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (ఎస్‌ఓజీ)కు చెందిన ఇద్దరు సిబ్బంది కూడా గాయపడ్డారు. అయితే ఈ ఘటన గురించి జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. ప్రాథమిక నివేదికల ప్రకారం మృతుడు ఆరిఫ్ హుస్సేన్ చీకా గ్రామానికి చెందినవాడని తెలిసింది. మరోవైపు ముందు జాగ్రత్త చర్యగా దోడ జిల్లాతో పాటు చీనబ్‌ ‌లోయవ్యాప్తంగా ఇంటర్నెట్ సేవలను అధికారులు నిలిపివేశారు.ఈ ఘటన పూర్తి వివరాల ప్రకారం జిల్లాలోని భదేర్వా పట్టణానికి 35 కిలోమీటర్ల దూరంలో జై-గాండో రహదారిపై గురువారం రాత్రి 11:30 గంటల సమయంలో ఆరిఫ్‌ ‌హుస్సేన్‌కు తుపాకీ గాయాలయ్యాయి. దీంతో వెంటనే దోడాలోని జిల్లాకు హుస్సేన్‌ ‌భద్రతా సిబ్బంది తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దోడా జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ తన్వీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ ‘శుక్రవారం తెల్లవారుజామున సుమారు 3 గంటలను ముగ్గుర్ని ఆస్పత్రికి తీసుకొచ్చారు. వీరిలో 35 ఏండ్ల వ్యక్తి అప్పటికే మృతి చెందాడు. అతనికి తుపాకీ గుండు గాయం ఉంది. మృతదేహానికి వైద్యుల బృందం పోస్ట్‌మార్టం నిర్వహించింది. నమూనాలను జమ్మూలోని ఫోరెన్సిక్ ప్రయోగశాలకు పంపాం. మిగతా ఇద్దరు రోగులకు ముఖం, తల, వీపుపై స్వల్ప గాయాలయ్యాయి’ అని తెలిపారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, ఆసుపత్రిలోనే ఉన్నారని చెప్పారు. ఎస్‌ఓజి బృందం ఆ ప్రాంతంలో గస్తీ నిర్వహిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగిఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -