Saturday, July 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుచెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం

చెన్నై-మధురై హైవేపై ప్రయివేటు స్లీపర్ బస్సు దగ్ధం

- Advertisement -

నవతెలంగాణ – మైదరాబాద్ : తమిళనాడులోని పెరంబలూర్ జిల్లా మంగళమేడు సమీపంలో ప్రయాణికులతో వెళ్తున్న ప్రయివేటు స్లీపర్ బస్సు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుని పూర్తిగా దగ్ధమైంది. చెన్నై నుంచి మదురై వెళ్తున్న ఈ బస్సులో ప్రమాద సమయంలో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం నుంచి పొగలు రావడాన్ని గమనించిన డ్రైవర్ వెంటనే వాహనాన్ని నిలిపి ప్రయాణికులందరినీ సురక్షితంగా దించడంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం మంటలు బస్సంతా వ్యాపించి పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకురాగా, ఈ ఘటనతో జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -