– చైర్‌పర్సన్ సీతా దయాకర్ రెడ్డికి గాయాలు
నవతెలంగాణ – మక్తల్
తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్, మాజీ ఎమ్మెల్యే సీతా దయాకర్ రెడ్డి గుజరాత్ పర్యటనలో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. గత శనివారం ద్వారకలోని రుక్మిణి దేవాలయాన్ని సందర్శిస్తున్న సమయంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో మెట్లపై నుంచి జారి పడినట్లు సమాచారం.ఈ ఘటనలో ఆమె ముఖం, చేయి, కాలికి గాయాలు కావడంతో రక్తస్రావం జరిగినట్లు తెలిసింది. వెంటనే అక్కడి అధికారులు, వైద్య సిబ్బంది సహాయంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఇండిగో విమానంలో హైదరాబాద్‌కు తరలించారు.గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్యులు సుమారు ఏడు గంటలపాటు శస్త్రచికిత్సలు నిర్వహించి చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్య వర్గాలు తెలిపాయి. సీతా దయాకర్ రెడ్డి ప్రమాదానికి గురికావడం పట్ల తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యురాలు బండి అపర్ణ ఆందోళన వ్యక్తం చేశారు. ఆమె త్వరగా పూర్తి ఆరోగ్యంతో కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రార్థనలు చేస్తున్నట్లు తెలిపారు.
గుజరాత్ పర్యటనలో రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్‌పర్సన్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



