Saturday, July 18, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంవిషాదం: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

విషాదం: కొండచరియలు విరిగిపడి 8 మంది మృతి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : నైరుతి చైనాలోని చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందగా, మరో 34 మంది గల్లంతైనట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 10 మందిని సహాయక బృందాలు సురక్షితంగా రక్షించాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, వుజియాంగ్ నది సమీపంలోని పెంగ్‌షుయ్ కౌంటీలో ఈ ప్రమాదం సంభవించింది. కుండపోత వర్షాల ధాటికి కొండపై నుంచి భారీగా మట్టి, రాళ్లు జారిపడటంతో 10కి పైగా నివాస భవనాలు శిథిలాల కింద కూరుకుపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఆ శిథిలాల కింద చిక్కుకుపోయారు.

సమాచారం అందిన వెంటనే సహాయక చర్యలు ప్రారంభమయ్యాయి. చైనా అత్యవసర నిర్వహణ మంత్రిత్వ శాఖ ‘లెవెల్-II’ జాతీయ అత్యవసర ప్రతిస్పందనను ప్రకటించింది. విపత్తు నివారణ కమిషన్ కూడా సహాయక చర్యల పర్యవేక్షణ కోసం ప్రత్యేక బృందాన్ని పంపింది. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సుమారు 1,100 మందికి పైగా స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -