Saturday, July 18, 2026
E-PAPER
Homeతాజా వార్తలుబహదూర్‌గూడలో ఉద్రిక్తత

బహదూర్‌గూడలో ఉద్రిక్తత

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : శంషాబాద్‌లోని బహదూర్‌గూడలో 650 ఎకరాల భూమికి కంచె వేసేందుకు హైడ్రా, రెవెన్యూ అధికారులు వచ్చారు. వారిని రైతులు అడ్డుకొని తమకు న్యాయం చేశాకే కంచె వేయాలని విజ్ఞప్తి చేశారు. అయినా అధికారులు ముందుకువెళ్లడంతో వారి తీరుకు నిరసనగా రైతులు ఆందోళనకు దిగారు. దీంతో రైతులు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఈ తోపులాటలో రైతు నరసింహ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని ఆసుపత్రికి తరలిస్తుండగా తోటి రైతులు అడ్డుకొనడంతో ఉద్రిక్తత నెలకొంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -