నవతెలంగాణ – దర్పల్లి
మండల కేంద్రములో ఎన్టిఆర్ కాలనిలో పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, నిజామాబాద్ ఏసీపీ ఆధ్వర్యంలో శనివారం కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్పల్లి సర్కిల్ పరిధిలోని సీఐ, ధర్పల్లి ఎస్సై, సిరికొండ ఎస్సై సిబ్బంది, జక్రాన్‌పల్లి ఎస్సైతో పాటు సిబ్బంది, డిచ్‌పల్లి పోలీస్ స్టేషన్‌ల సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఎన్‌టీఆర్ కాలనీలో ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. అలాగే, సరైన పత్రాలు లేని 32 వాహనాలను గుర్తించారు. ఈ సందర్భంగా ప్రజలకు సీసీ కెమెరాల ప్రాముఖ్యత, సైబర్ నేరాల పట్ల, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ వినియోగం, వాహనాల పత్రాలు తప్పనిసరిగా కలిగి ఉండాలని అవగాహన కల్పించారు. ప్రజల భద్రతే పోలీసుల ప్రధాన లక్ష్యమని, అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనల గురించి వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని వారు కోరారు.
ఎన్‌టీఆర్ కాలనీలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్
- Advertisement -
- Advertisement -



