Saturday, July 18, 2026
E-PAPER
Homeజాతీయంలిప్టులో పెట్ డాగ్ హల్ చల్ ..వీడియో

లిప్టులో పెట్ డాగ్ హల్ చల్ ..వీడియో

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: ఓ పెంపుడు కుక్క లిప్టులో హల్ చల్ చేసింది. ముగ్గురు యువతులపైకి దూసుకెళ్లింది. అందుకు సంబంధించిన సీసీ పుటేజీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదురు వీడియో ప్రకారం ముంబాయిలోని ఓ అపార్టుమెంట్ సముదాయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. సదురు లిప్టు లో ముందుగానే ముగ్గురు మహిళలు ఉండగా, ఓ మహిళా పెంపుడు కుక్కతో లిప్టులోకి ప్రవేశించింది. వచ్చి రాగానే కుక్క లిప్టులో ఉన్న ముగ్గురు మహిళలపై ఎటాక్ చేసింది. దీంతో బాధితులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యరు.

లిప్టు డోర్ ఓపెన్ కాగానే ఇద్దరు యువతులు తప్పించుకున్నారు. మరో మహిళ భయంతో లిప్టులోనే ఉండిపోయింది. ఆమెపై అరుస్తూ కుక్క ముందుకు దూసుకెళ్లింది. దీంతో పెట్ ఓనర్ కుక్కను నియంత్రించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ప్రస్తుతం సీసీటీవీలో రికార్డయిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -