- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలో శనివారం ఎస్ఐఆర్ సమీక్షా సమావేశం జరిగింది. ఈ క్రమంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా నియోజకవర్గంలోని మద్నూర్ మండలంలోని పెద్దతడగూర్ గ్రామ డూప్లికేట్ ఓటర్ల జాబితాను రాష్ట్ర మాజీ ప్యానల్ స్పీకర్ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే ఆదేశాల మేరకు బీఎల్ఏలకు మండలాక్షధ్యక్షలు బన్సి పటేల్ శనివారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కోరారు. నియోజకవర్గం వారీగా అర్హులైన ఏ ఒక్కరి ఓటూ గల్లంతు కాకుండా చూడాలని ఆయన స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఎల్ఏలు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



