నవతెలంగాణ – ధర్పల్లి
ఎస్ఐఆర్ కార్యక్రములో ఓటు ఉన్న ప్రతి ఒక్కరు పాల్గొనాలని మాజీ రూరల్ ఎమ్మెల్యే ఆకుల లలిత అన్నారు. శనివారం ఆమె మండలంలోని హోన్నజీపేటలో జరుగుతున్న ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గ్రామంలోని అభివృద్ధి కమిటీ ఓటర్ నమోదు కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని ఆమె కొనియాడారు. హోన్నజీపేట గ్రామ పరిధిలోని నాలుగు పోలింగ్ బూతులలో మూడు బూతులు నూరు శాతం వరకు సాధించడం మరో బూతులు 96% సాధించడం అభినందనీయమన్నారు. గ్రామ సర్పంచ్ వార్డు సభ్యులు అన్ని వర్గాల వారు పాల్గొనడం అర్షనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తరపున పాల్గొన్న బిఎల్ఏలు పార్టీ నాయకులు బిఎల్ఓ లు వారి వివరాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు చెలిమెల నరసయ్య, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజేందర్, గ్రామ కమిటీ నాయకులు సుభాష్ రెడ్డి, భగవాన్ రెడ్డి, జానీరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, గంగాధర్, ముఖిద్, సంపత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఎస్ఐఆర్ లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి: మాజీ ఎమ్మెల్యే ఆకుల లలిత
- Advertisement -
- Advertisement -



