Saturday, July 18, 2026
E-PAPER
Homeఆదిలాబాద్భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

భూగర్భ జలాలు పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి 

- Advertisement -

 మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్
నవతెలంగాణ-కుభీర్
ఎల్ ని నో ప్రభావం వల్ల గత ఏడాది కంటే ఈ ఏడాది లో వర్షభావం 40% వర్షపాతం మాత్రమే నమోదు కావడంతో గ్రామమలో భూగర్భ జలాలు పెంచేందుకు గ్రామమలో ఉన్న ప్రతి ఒక్కరు కృషి చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్ అన్నారు. శనివారం మండల కేంద్రమైన కుభీర్ ఎంపీడీఓ కార్యాలయంలో ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శి లు, వ్యవసాయ శాఖ అధికారులు, ఉపాధిహామీ సిబ్బందితో సమీక్షా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.

గ్రామమలో విబిజీ రామజీ పథకం ద్వారా ఇంకుడు గుంతలు, పంపండ్, పనులను గ్రామంలో ప్రతి ఒక్కరు నిర్మించుకోవాలని సూచించారు. వీటితో భూగర్భ జలాలు పెరిగి నీటి కొరత ఉండకుండా ఉంటుందని తెలిపారు. అదే విదంగా గ్రామమలో ఇందిరమ్మ గృహాలు నిర్మల్ జిల్లాలోనే కుభీర్ మండలం మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ అభినందించారు. దీంతోపాటు కొన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులు త్వరగా పూర్తిచేసి గృహప్రవేశాలు చేసుకోవాలని అధికారులను సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీనివాస్, ఎంపీ ఓ బీమేష్, వ్యవసాయ శాఖ మండల అధికారి సారిక, ఉపాధిహామీ ఏ పీఓ హరిలాల్,ఆయా గ్రామాల సర్పంచులు పంచాయతీ కార్యదర్శి లు ఉపాధిహామీ పీల్డ్ అసిస్టెంట్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -