నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలో సెక్రటరియేట్లో శనివారం ఆమె పలు శాఖల ప్రధాన అధికారులను కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. విద్యాశాఖ సహాయ కార్యదర్శి యస్. శ్రీనివాసరెడ్డిని కలిసి నియోజకవర్గంలోని విద్యా రంగ సమస్యలపై చర్చించారు. అనంతరం మినిస్టర్ ఫేషీలో హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సత్తుపల్లి నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి ఆమె తీసుకెళ్లారు. ముఖ్యంగా వైద్య, విద్యా రంగాల్లో మౌలిక వసతుల కల్పనపై సుదీర్ఘంగా మాట్లాడారు. ప్రజా సమస్యలను ఎమ్మెల్యే వివరించారు. ఆయన సమస్యలను సత్వరమే పరిష్కరించి నియోజకవర్గ ప్రగతికి సహకరించాలని అధికారులను కోరారు. దీనిపై అధికారులు సైతం సానుకూలంగా స్పందించి, సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
సత్తుపల్లి అభివృద్ధికై ఉన్నతాధికారులను కలిసిన ఎమ్మెల్యే
- Advertisement -
- Advertisement -



