- బ్రిటన్ మాజీ పీఎం కీర్ స్టార్మర్
నవతెలంగాణ-హైదరాబాద్: కాబోయే ప్రధాని ఆండీ బర్న్హామ్ కు అన్ని విజయాలు కలగాలని కోరుకుంటున్నాను, ఆయనకు తన పూర్తి మద్దతు ఉంటుందని బ్రిటన్ మాజీ పీఎం కీర్ స్టార్మర్ వెల్లడించారు. లేబర్ పార్టీలోని ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాలు ఎల్లప్పుడూ ఒక జట్టు క్రీడ లాంటివి అని ఆయన అభివర్ణించారు. ఇంగ్లాండ్ కు సేవ చేసే అవకాశం ఇచ్చినందుకు బ్రిటిష్ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. “నేను సంతోషంగా, చిరునవ్వుతో, మనం సాధించిన ప్రతిదానికీ గర్వంగా వెళ్తున్నాను” అని స్టార్మర్ పేర్కొన్నారు.10 డౌనింగ్ స్ట్రీట్ లో ఏర్పాటు చేసిన వీడ్కోలు సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను కింగ్ చార్లెస్ IIIకి రాజీనామా సమర్పించబోతున్నానని, ప్రధానమంత్రిగా తన పదవీకాలానికి ముగింపు పలుకుతున్నానని” చెబుతూ స్టార్మర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. లెబర్ పార్టీ దేశాన్ని అని విధాలుగా అభివృద్ధి చేశామని తెలియజేవారు.



