Tuesday, July 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజావాణికి 121 దరఖాస్తులు

ప్రజావాణికి 121 దరఖాస్తులు

- Advertisement -

– అర్జీలను సత్వరమే పరిష్కరించాలి
–  అదనపు కలెక్టర్ విక్టర్
నవతెలంగాణ – కామారెడ్డి

ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా అదనపు కలెక్టర్ విక్టర్ ప్రజల నుంచి వివిధ సమస్యలకు సంబంధించిన 121 దరఖాస్తులను స్వీకరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన అర్జీదారులను అదనపు కలెక్టర్ స్వయంగా వారి సమస్యలను తెలుసుకున్నారు. అందిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులకు పంపిస్తూ, వాటిని ప్రాధాన్యతతో పరిశీలించి నిబంధనల మేరకు త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పాండు, జిల్లా అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -