ఎంసిపిఐ(సి) జిల్లా కార్యదర్శి అక్కల బాపు యాదవ్
నవతెలంగాణ – మల్హర్ రావు
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్‌లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని ఎంసిపిఐ(సి) జయశంకర్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి అక్కల బాపు యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు సింగరేణి సంస్థలో వేలాది మంది కాంట్రాక్ట్ కార్మికులు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నప్పటికీ, వేతనాల విషయంలో వారికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
శాశ్వత కార్మికులతో సమానమైన పనులు చేయిస్తూ.. వేతనాలు మాత్రం తక్కువగా చెల్లించడం సరికాదన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాలతో పాటు ఈఎస్ఐ, పిఏప్, బోనస్, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. వేతనాల కోసం ప్రశ్నించే కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారనే ఆరోపణలపై అధికారులు దృష్టి సారించాలని కోరారు. పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని, కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేయాలని కోరారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించకపోతే కార్మిక సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.



