Sunday, September 20, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ దందా..ఆగేదుందా.?

అక్రమ దందా..ఆగేదుందా.?

- Advertisement -

నవతెలంగాణ-మల్హర్ రావు
వల్లెంకుంట, తాడిచెర్ల, మల్లారం మానేరు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. రాత్రి, పగలు అనే తేడాలేకుండా అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. అనుమతుల మాటున దందా జోరుగా సాగుతోంది. శుక్రవారం నవ తెలంగాణ దినపత్రికలో వచ్చిన వల్లేంకుంట మానేరులో ఇసుక తోడేళ్ళు, అనే కథనానికి రెవెన్యూశాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు శనివారం జిపిఓ రాజేందర్ అక్రమ ఇసుక ట్రాక్టర్లను పెట్టేందుకు మానేరులో మకాం వేశారు. అధికారులు పర్యవేక్షణకు వచ్చారని తెలుసుకున్న ఇసుక అక్రమార్కులు ఈ ఒక్కరోజు ఇటువైపు రాలేదని వల్లెంకుంట గ్రామస్థులు పేర్కొన్నారు. దీంతో అక్రమ దందా ఆగేదుందా..కొన్ని రోజులైన తరువాత రెచ్చిపోతారా అని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఇందిరమ్మ ఇళ్లకు తీసుకెళ్లడానికి అనుమతులు ఉండగా..అక్రమార్కులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. అనుమతుల పేరుతో అక్రమ ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -