28 ఏళ్ల స్నేహానికి ఇదే నిదర్శనం..
నవతెలంగాణ-సంగారెడ్డి
హత్నూర మండలంలోని తుర్కల ఖానాపూర్ ప్రభుత్వ పాఠశాలలో 1997లో పదవ తరగతి చదివిన విద్యార్థిని క్రీ,శే నిర్మల ఇటీవల రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.ఆమెతో కలిసి చదువుకున్న సహ విద్యార్థులు తమ చిన్ననాటి స్నేహితురాలిని మరువలేక, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వినూత్నంగా నివాళులర్పించారు.సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు, రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
తమ స్నేహితురాలి పేరు చిరస్థాయిగా నిలిచేలా వారు చేసిన ఈ కార్యక్రమం స్థానికంగా అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తోటి స్నేహితురాలు నిర్మల రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని ఆమె సహ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు.”చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఆమె ఎప్పుడూ నవ్వుతూ ఉండేది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె గుర్తుగా ఏదైనా చేయాలని ఉద్దేశంతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పేదలకు, ఆసుపత్రికి వచ్చిన రోగుల బంధువులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.”ఆకలితో ఉన్నవారికి అన్నం పెడితే, మా నిర్మలకు పుణ్యం దక్కుతుందని మా నమ్మకం” అంటూ వారు తమ స్నేహాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సహా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


