
బడుగు బలహీనవర్గాల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఎల్వోసీ అందజేయడం జరిగిందని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గొల్లపల్లి కనకయ్య అన్నారు. శుక్రవారం హైదరాబాద్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో బాధితులకు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఎల్ఓసి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే రాష్ట్రం ప్రగతి బాటలో నడిచినట్లని తెలిపారు.నిరుపేదల అభివృద్ధి లక్ష్యంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతూ నిరంతరం వారి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తారన్నారు. రాయపోల్ మండలం రామారం గ్రామానికి చెందిన రెడ్డెబోయిన నవీన్ అనారోగ్యంతో హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి 5 లక్షల రూపాయల ఎల్వోసి పత్రం అందజేయడం జరిగిందన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలు అనారోగ్యానికి గురైై ప్రాణాలను పోగొట్టుకోవద్దని గొప్ప ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారి కుటుంబాలకు ఆసరాగా ఉండేందుకు సీఎం సహాయనిధి పథకం ద్వారా వారిని ఆదుకోవడం కోసం సీఎం సహాయనిధి చెక్కులు అందజేయడం జరిగిందన్నారు. అలాగే ఇకముందు కూడా నియోజకవర్గంలో ఎవరైనా సరే అనారోగ్యానికి గురైనప్పుడు సీఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకొని లబ్ధి పొందాలని తెలియజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతోటి పేదలకు సీఎం సహాయనిధి కింద అనేకమందికి లబ్ది చేకూరుతుందని నిరుపేదలకు అండగా నిలుస్తున్న అందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు.ఈ కార్యక్రమంలో మండల యువజన కాంగ్రెస్ నాయకులు దుర్గ ప్రసాద్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.