- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఫిఫా వరల్డ్‌కప్ 2026 విజేత స్పెయిన్ తాజా ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. సోమవారం ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో రన్నరప్‌గా నిలిచిన అర్జెంటీనా రెండో స్థానాన్ని నిలబెట్టుకుంది. కిలియన్ ఎంబాపే సారథ్యంలోని ఫ్రాన్స్ మూడో ర్యాంకుకు పడిపోయింది. కాంస్య పోరులో ఫ్రాన్స్‌ను ఓడించిన ఇంగ్లండ్ నాలుగో ర్యాంక్ సొంతం చేసుకుంది. బ్రెజిల్, మొరాకో 5, 6 స్థానాల్లో నిలిచాయి. పోర్చుగల్, బెల్జియం, నెదర్లాండ్స్, మెక్సికో జట్లు వరుసగా 7, 8, 9, 10 ర్యాంకుల్లో ఉన్నాయి.
- Advertisement -



