- Advertisement -
– మోడీ రాజీనామా చేయాలని డిమాండ్
నవతెలంగాణ ఢిల్లీ: రాజధాని ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసీ వేణుగోపాల్ నేతృత్వంలో ప్రధాని నరేంద్ర మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. ప్రధాని నివాసానికి పాదయాత్రగా వెళ్లిన ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఆ పార్టీ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో ఆ ప్రాంతంలో భద్రతను పోలీసులు కట్టుదిట్టం చేశారు.
- Advertisement -



