Tuesday, July 21, 2026
E-PAPER
Homeజాతీయంమెదాంత ఆస్పత్రికి వాంగ్‌చుక్‌ తరలింపు

మెదాంత ఆస్పత్రికి వాంగ్‌చుక్‌ తరలింపు

- Advertisement -
  • వాంగ్‌చుక్‌ భార్య గీతాంజలి అంగ్మో

నవతెలంగాణ-హైదరాబాద్: విద్యార్థులపై పోలీసుల క్రూరత్వానికి నిరసనగా, విద్యార్థులకు సంఘీభావంగా వాంగ్‌చుక్‌ నిరాహారదీక్ష‍ను కొనసాగించాలని నిర్ణయించుకున్నారని ఆయన భార్య గీతాంజలి అంగ్మో పేర్కొన్నారు. వాంగ్‌చుక్‌ను సఫ్దర్‌గంజ్ ఆస్పత్రి నుండి మెదాంత ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిస్తూ మంగళవారం ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఆమె స్వాగతించారు. ఆస్పత్రి మార్చేందుకు అనుమతించిన హైకోర్టుకు ధన్యావాదాలు తెలుతున్నానని అన్నారు. దేశంలో, ఒక పౌరుడికి తనకు నచ్చిన వైద్యుడిని, ఆస్పత్రిని, చికిత్సను ఎంచుకునే హక్కు ప్రజాస్వామ్యం కల్పించిందని అన్నారు. సఫ్దర్‌గంజ్‌ ఆస్పత్రికి తీసుకువచ్చిన విధానంతో తమకు అపనమ్మకం ఏర్పడిందని అన్నారు. వాంగ్‌చుక్‌ను ఆస్పత్రిలో చేర్చాల్సిన అవసరం లేదని, జంతర్‌మంతర్‌లోనే ఆయనకు వైద్య చికిత్స అందించి ఉండవచ్చని అన్నారు. బయటి వ్యక్తులు ఆయనను కలవకుండా అడ్డుకున్నారని అన్నారు. పలువురు ఎంపిలు ఆయనను పరామర్శించేందుకు ఆస్పత్రికి వచ్చారని, కానీ ఎవరినీ అనుమతించలేదని, ఇది ఆయనను నిర్బంధించడం, బంధించడమేనని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -