నవతెలంగాణ-హైదరాబాద్: లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ పలువురు ఎంపీలతో కలిసి మంగళవారం స్పీకర్ ఓం బిర్లాను కలిశారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా తెలియజేశారు. భవిష్యత్తుకు సంబంధించిన న్యాయమైన ప్రశ్నలు లెవనెత్తారని, అందుకు విద్యార్థులపై అన్యాయంగా లాఠీచార్జీ చేశారని తెలియజేశారు. ప్రస్తుత వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చ పెట్టాలని కోరారు. విద్యార్థుల డిమాండ్ లపై ఉభయ సభల్లో సమగ్ర చర్చ కొనసాగించాలని స్పీకర్ కు సూచించారు.
‘దేశ యువతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో పార్లమెంట్ పాత్రను ప్రశ్నించారు. తమ సొంత భవిష్యత్తు గురించి న్యాయమైన ప్రశ్నలు అడిగినందుకు విద్యార్థులను కొట్టారు. భారత యువత భవిష్యత్తు గురించి పార్లమెంట్ చర్చించలేకపోతే, దాని ప్రయోజనం ఏమిటి?” అని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు అన్నారు. పార్లమెంట్ లోపల, వెలుపల ప్రతిపక్షం ఈ విషయాన్ని లేవనెత్తుతూనే ఉంటుందని ఆయన ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.



