Wednesday, July 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యార్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం

విద్యార్థులపై లాఠీచార్జీని తీవ్రంగా ఖండిస్తున్నాం

- Advertisement -

కొండాపూర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సందగళ్ళ సునీల్
నవతెలంగాణ – కొండాపూర్
ఢిల్లీలో పేపర్ లీక్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు, యువతపై జరిగిన లాఠీచార్జీని కొండాపూర్ మండల సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సందగళ్ళ సునీల్ తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశానికి వెన్నెముకలాంటి యువత, విద్యార్థులపై బలప్రయోగం చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. విద్యార్థులు తమ హక్కుల కోసం ప్రశ్నిస్తే వారిపై లాఠీచార్జీ చేసి రక్తపాతం జరిగేలా వ్యవహరించడం అత్యంత దురదృష్టకరమని అన్నారు.

అలాగే, సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు లాఠీచార్జీలో పాల్గొన్నారనే వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, పోలీసు విధివిధానాలు, చట్టపరమైన నిబంధనలు పాటించబడాయా లేదా అనే విషయాన్ని ప్రజల ముందుంచాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, యువతతో ఘర్షణకు దిగిన ప్రభుత్వాలు చరిత్రలో ప్రజల తీర్పును ఎదుర్కొన్నాయని ఆయన హెచ్చరించారు. విద్యార్థుల సమస్యలను అణచివేయడం కాకుండా, వారికి న్యాయం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ విద్యార్థుల హక్కులను గౌరవించాలని, ఈ ఘటనలో బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -