- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్: సీతాఫల్ మండి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బంగ్లాభారతి తెలిపారు. ఈ మేరకు మంగళారం పత్రిక ప్రకటన విడుదల చేశారు. కామర్స్ -1 , కంప్యూటర్ సైన్స్-1, కంప్యూటర్ అప్లికేషన్-1, హిస్టరీ-1, మ్యాథమెటిక్స్-1, సంస్కృతం-1, వివిధ విభాగాల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు. పీజీలో 55 శాతం మార్కులు ఉండి, NET/SET, PhD ఉన్నవాళ్ళకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. తేదీ 24-7-2026 నాడు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.
- Advertisement -



