Wednesday, July 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్సిరిపెల్లి (హెచ్)ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్

సిరిపెల్లి (హెచ్)ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా: సర్పంచ్

- Advertisement -

నవతెలంగాణ-కుభీర్
మండలంలోనే సిరిపెళ్లి హెచ్ గ్రామాన్ని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్ది, అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్తానని గ్రామ సర్పంచ్, మండల సర్పంచ్ ల సంఘం ప్రధాన కార్యదర్శి అరేపెల్లి సతీష్ అన్నారు. మంగళవారం ఆయన నవతెలంగాణతో మాట్లాడుతూ.. గ్రామస్తుల ఆశీర్వాదంతో సర్పంచ్ గా గెలిచిన నాటినుండే గ్రామాభివృద్ధికి పాటుపడుతున్నానని తెలిపారు. గడిచిన రెండు నెలల వ్యవధిలోనే అభివృద్ధి పనులను ప్రారంభించానని చెప్పారు. ఇందులో భాగంగా నూతన సీసీ రోడ్లు, చెడిపోయిన విద్యత్ స్టాంభాల స్థానంలో కొత్త స్తంభాలు, తాగు నీటి సమస్య పరిష్కారానికి మినీ ట్యాంకులను గ్రామస్తుల అవసరాల దృష్ట్యా అందుబాటులోకి తీసుకొచ్చానని తెలిపారు.

అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనానికి తాత్కాలిక మరమ్మత్తులు, గ్రామ చౌరాస్తాలో ఐమాక్స్ ఎల్ఈడి బల్బుల ఏర్పాటు, వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మురికి కాలువలు, వీధి దీపాలు, రోడ్డుకిరువైపులా ముండ్ల పొదల తొలగింపు, ప్రాథమిక పాఠశాల, అంగన్వాడి కేంద్రాల్లో మరుగుదొడ్ల నిర్మాణాలు చేపట్టామని గుర్తు చేశారు. వీటితో పాటు గ్రామానికి మౌళిక సదుపాయాలు కల్పించి అభివృద్దికి కృషి చేస్తానని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, వారి సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని, గ్రామాభివృద్ధే నా ప్రథమ ధ్యేయమని చెప్పారు. భవిష్యత్తులో సిరిపెల్లి హెచ్ గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్ధడమే నా ముందున్న ప్రధాన కర్తవ్యమన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -