నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రధాని మోడీ ఇంటి దగ్గర ధర్నా చేస్తున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ వెళ్లారు. రాహుల్ గాంధీతో ఆయన చర్చలు జరిపారు. రాహుల్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. ఆందోళన విరమించాలని కోరారు.
సోమవారం జంతర్‌మంతర్ వద్ద నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఆందోళన చేస్తున్న విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌కు నిరసనగా.. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కెసీ వేణుగోపాల్ నేతృత్వంలో ప్రధాని మోడీ నివాసాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించాయి. ప్రధాని నివాసానికి పాదయాత్రగా వెళ్లిన ఖర్గే, రాహుల్, ప్రియాంక, ఆ పార్టీ నేతలు అక్కడే రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.



