Wednesday, July 22, 2026
E-PAPER
Homeతాజా వార్తలుడ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

- Advertisement -

– డా. చినుకని శివ ప్రసాద్
నవతెలంగాణ-హైదరాబాద్ : డ్రగ్స్ (మాదకద్రవ్యాలు) వ్యసనం నేడు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెడుతున్న అతిపెద్ద సామాజిక సమస్యగా మారిందని సహస్ర ఫౌండేషన్ చైర్మన్ , తెలంగాణ హోమియో డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు డా. చినుకని శివ ప్రసాద్ పేర్కొన్నారు. డ్రగ్స్ వినియోగం వల్ల యువత శారీరక, మానసిక ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా కుటుంబ వ్యవస్థలు విచ్ఛిన్నమవుతున్నాయని, విద్య, ఉపాధి, వ్యక్తిత్వ వికాసం దెబ్బతింటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రగ్స్ కారణంగా నేరాలు, రోడ్డు ప్రమాదాలు, హింసాత్మక ఘటనలు పెరిగి సమాజంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోందన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, యువత క్షణిక ఆనందం కోసం జీవితాన్ని నాశనం చేసుకునే మార్గాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎంచుకోవద్దని, క్రీడలు, విద్య, నైపుణ్యాభివృద్ధి, సామాజిక సేవ వంటి సానుకూల రంగాల్లో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. డ్రగ్స్ నిర్మూలనలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యాసంస్థలు, పోలీసు శాఖ, వైద్యులు, స్వచ్ఛంద సంస్థలు, మీడియా మరియు ప్రజాప్రతినిధులు సమిష్టిగా పనిచేయాలని ఆయన కోరారు. పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ దుష్పరిణామాలపై నిరంతర అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. సహస్ర ఫౌండేషన్ రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు, యువజన సదస్సులు, పోస్టర్ ప్రచారాలు, ర్యాలీలు మరియు ఆరోగ్య చైతన్య కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -