- Advertisement -
యుద్ధం అంటే అద్దం కాదు,
పదే పదే చూడటానికి.
ప్రాణాలు పోతే తిరిగి రావు
మరోసారి బ్రతకడానికి
పెంచుకొన్న సాంకేతికత
అమాయక ప్రాణాలను తీయడానికా?
ఎన్నుకున్న నాయకుల నిర్ణయాలు నరులను
బలి పశువుల్ని చేయడానికా?
ఓ యుద్ధమా, చేయు నాయకుల మదిలో
అంతర్యుద్ధం చూపు
విధ్వంసమే నీ పర్యవసానం
వీలైతే చేయు ఒక సహాయం
ఆపు నీ యుద్ధం మేలుకొలుపు
విశ్వశాంతికి ఉదయం
డా. మైలవరం చంద్ర శేఖర్,
8187056918
- Advertisement -



