నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని ముత్తన్నపేట గ్రామ శివారులో ప్రధాన రోడ్డుపై బుధవారం కారు బీభత్సం సృష్టించింది. స్తానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని, ఆటోను కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. దీంతో రెండు వాహనాలు రోడ్డుకిరువైలా బోల్తాపడ్డాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దాచారం గ్రామానికి చెందిన కనగండ్ల పోచయ్య, ఆటో డ్రైవర్ ఐలయ్యకు గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను 108 సిబ్బంది కరీంనగర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వారిని అదునులోకి తీసుకుని ఠాణాకు తరలించారు.
మద్యం మత్తలోనే ప్రమాదం:ఎస్ఐ తిరుపతి
“పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం యాంటిక్లైన్ కాలనీకి చెందిన రామగిరి అగ్ని మద్యం మత్తులోనే కారు నడిపినట్టు నిర్దారించాం. అజాగ్రత్తగా నడపడం వల్ల కారు ద్విచక్ర వాహనం, ఆటోను బలంగా ఢీకొట్టింది. ప్రమాదానికి కారణమైన ఇద్దరిపై బాధితుడి బంధువు కనగండ్ల తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టా” మన్నారు.



