Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంవంటగ్యాస్ కొరత వలన దేశ ప్రజలకు ఇబ్బందులు 

వంటగ్యాస్ కొరత వలన దేశ ప్రజలకు ఇబ్బందులు 

- Advertisement -

ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయిల్ చేస్తున్న యుద్ధం వల్లే వంట గ్యాస్ ధరల పెంప
సీపీఐ(ఎం) రాజకీయ విద్యా విభాగం కన్వీనర్ బండారు రమేష్ 
నవతెలంగాణ – బోనకల్ 

అమెరికా యుద్ధ కాంక్ష వల్లే భారతదేశంలో వంట గ్యాస్ కొరత ఏర్పడిందని, దీని ఫలితంగా దేశ ప్రజలందరూ వంటగ్యాస్ కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీపీఐ(ఎం) రాజకీయ విద్యా విభాగం జిల్లా కన్వీనర్ బండారు రమేష్ సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు చింతలచెరువు కోటేశ్వరరావు మండల కార్యదర్శి కిలారు సురేష్ అన్నారు. సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం లోని బోనకల్లు మండల కేంద్రంలో గల స్థానిక ఖమ్మం బస్టాండు సెంటర్లో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు నిరసనగా గంటపాటు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు.

తొలుత స్థానిక సీపీఐ(ఎం) కార్యాలయం నుంచి ప్రదర్శనగా బోసు బొమ్మ సెంటర్ మీదుగా స్థానిక ఖమ్మం బస్టాండ్ సెంటర్ కు చేరుకున్నారు. అక్కడే గంటపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమెరికా ఆదిపత్యం కోసం చేస్తున్న యుద్ధము వలన కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గ్యాస్ దారులను పెంచటాన్ని తీవ్రంగా ఖండించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కు పూర్తిగా లొంగిపోయి బానిసగా మారిపోయాడని ఘాటుగా విమర్శించారు. మనం ఏ దేశంతో ఎటువంటి ఒప్పందం చేసుకోవాలో ఏది దిగుమతి చేసుకోవాలో నిర్ణయించడానికి అమెరికా ఎవరని వారు ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లుగా నరేంద్ర మోడీ గుడ్డిగా తల ఊపుతూ దేశ ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాడని విమర్శించారు. ప్రధానమంత్రికి ముందుచూపు, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇష్టానుసారంగా గ్యాస్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపారని విమర్శించారు.

ఓ దేశ ప్రధాని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేని శక్తిహీనుడిగా నరేంద్ర మోడీ తయారయ్యాడని విమర్శించారు. మనం ఏం చేయాలో మనం ఏ నిర్ణయాలు చేయాలో అమెరికా అధ్యక్షుడు చెప్పటం నరేంద్ర మోడీ తల ఊపటం మన దేశ సార్వభౌమాధికారాన్ని తాకట్టు పెట్టడమే అన్నారు. అమెరికా సాగిస్తున్న యుద్ధము వలన అంతర్జాతీయంగా తలెత్తిన అస్థిర పరిస్థితులు, ఫలితంగా చమురు, గ్యాస్ సరఫరాకు ఆటంకాలు కలిగిన నేపథ్యంలో దేశ ప్రయోజనాలను పరీక్షించగలిగేలా దేశంలో తగినన్ని గ్యాస్ నిల్వలు ఉండేలా చూసుకోవటంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) నాయకులు జొన్నలగడ్డ సునీత, పిల్లలమర్రి ఝాన్సీ రాణి, దొండపాటి సత్యనారాయణ, కొంగర గోపి, గండు సైదులు, బొప్పాల రమేష్, తెల్లాకుల శ్రీనివాసరావు, బోయినపల్లి వీరబాబు, ఉప్పర శ్రీను, గుగులోత్ నరేష్, కూచిపూడి మురళీకృష్ణ, బిల్లా విశ్వనాథం, కోట కాటయ్య, ఏసుపోగు బాబు, పిక్కెల సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -