Wednesday, July 22, 2026
E-PAPER
Homeఆదిలాబాద్25న అరుణోదయ నాగన్న సంతాప సభ

25న అరుణోదయ నాగన్న సంతాప సభ

- Advertisement -

నవతెలంగాణ-ఆదిలాబాద్ టౌన్
ప్రజా గాయకుడు, విప్లవ సాంస్కృతిక యోధుడు, ఆదర్శ కమ్యూనిస్టు కామ్రేడ్ అరుణోదయ నాగన్న సంతాప సభను జయప్రదం చేయాలని ఐఎఫ్.టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి వెంకటనారాయణ పిలుపునిచ్చారు. బుధవారం కొమురం భీం భవనంలో ప్రజాసంఘాల అధ్వర్యంలో పోస్టర్ లను ఆవిష్కరించారు. ఈనెల 25న హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో అరుణోదయ నాగన్న సంతాప సభ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రజా గాయకుడిగా విప్లవ సాంస్కృతిక యోధుడిగా గత 50 సంవత్సరాలు కృషి చేస్తున్న అరుణోదయ నాగన్న కంచు కంఠం జులై 3 2026న శాశ్వతంగా మూగబోయిందన్నారు.

నాగన్న గొంతు ఎత్తితే పాట పాడితే అది ఉప్పొంగే జలపాతం అవుతుందని కొనియాడారు. నాగన్న కళాకారుడిగా జీవితాంతం క్రమశిక్షణకు మారుపేరుగా నిలబడ్డాడని, నిరాడంబర జీవితాన్ని గడిపాడన్నారు. ప్రజా కళాకారుడు, ప్రజా గాయకుడు ఎట్లా ఉండాలి అనేదానికి నాగన్ననే సజీవ ఉదాహరణ అని చెప్పుకునేలా జీవించాడని తెలిపారు. ఈనెల 25వ తేదీన జరిగే అరుణోదయ నాగన్న సంతాప సభలో జిల్లాలోని విప్లవ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని చేయాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు సుభాష్, మారుతి, పీడీఎస్.యూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు దీపలక్ష్మి, మండావి గణేష్, జిల్లా ఉపాధ్యక్షులు నాగేందర్, పీవైఎల్ రాష్ట్ర నాయకులు మెస్రం మారుతి, జిల్లా నాయకులు హరీష్ పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -