Wednesday, July 22, 2026
E-PAPER
Homeజాతీయంమాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు: సుప్రీంకోర్టు

మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు: సుప్రీంకోర్టు

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంట్ మార్చ్ సందర్భంగా విద్యార్థి నిరసనకారులపై పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌ను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. “మాకు వీడియోలు చూసే ఆసక్తి లేదు, అంత సమయం కూడా లేదు” అని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్య కాంత్ వ్యాఖ్యానిస్తూ, కాక్రోచ్ జనతా పార్టీ (సిజెపి) ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలపై జోక్యం చేసుకోవాలన్న అభ్యర్థనను తోసిపుచ్చారు. బుధవారం నాటి విచారణలో ఓ లాయర్ ఈ అంశాన్ని సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రస్తావిస్తూ, కోర్టు ఈ విషయాన్ని సుమోటోగా స్వీకరించాలని కోరారు. అయితే ధర్మాసనం అందుకు స్పష్టంగా నిరాకరించింది. “మా సమయాన్ని వృథా చేయకండి, మీ సమయాన్ని కూడా పాడుచేసుకోకండి” అని లాయర్‌కు సీజేఐ హితవు పలికారు.

నీట్-యుజి పేపర్ లీక్, ఇతర పరీక్షల అక్రమాలపై ‘కాక్రోచ్ జనతా పార్టీ’ ప్రధానంగా నిరసనలు నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత జర్నలిజం, సామాజిక ఉద్యమాల వైపు రావడంపై గతంలో సీజేఐ సూర్య కాంత్ స్పందిస్తూ ‘కాక్రోచ్’ (బొద్దింకలు) అనే పదాన్ని వాడగా, ఆ వ్యాఖ్యల ఆధారంగానే ఈ వ్యంగ్య వేదిక ఏర్పడటం గమనార్హం. ఆ వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత రావడంతో, తాను నకిలీ డిగ్రీలు ఉన్న వారిని ఉద్దేశించి మాత్రమే ఆ మాట అన్నానని సీజేఐ తదనంతరం వివరణ ఇచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -