Wednesday, August 12, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బిఎల్ఓ లకు ఘన సన్మానం

బిఎల్ఓ లకు ఘన సన్మానం

- Advertisement -

– వడ్డేపల్లి సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్
నవతెలంగాణ – రాయపోల్ 

రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో సమగ్ర ఓటర్ నమూనా (ఎస్‌ఐఆర్) ప్రక్రియను వంద శాతం విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా గ్రామంలోని బూత్ లెవల్ అధికారులును ఘనంగా సన్మానించడం జరిగిందని గ్రామ సర్పంచ్ రాజాగారి రేణుక రాజాగౌడ్ తెలిపారు. బుధవారం రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలో రైతు వేదికలో నిర్వహించిన గ్రామసభలో ఎస్ఐఆర్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేసిన బిఎల్వో లకు, అధికారులకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఓటర్ నమోదు ప్రక్రియను గ్రామంలో అధికారులు, బీఎల్‌ఓల సమన్వయంతో ఓటర్ నమోదు ప్రక్రియను పూర్తి చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రక్రియలో ప్రతి అర్హుడిని నమోదు చేయడంలో గ్రామస్థులు సహకరించడం అభినందనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో ఏపీఎం యాదగిరి, ఈసీ జనార్ధన్, గ్రామ  ఉపసర్పంచ్ మర్యాల స్వామి, పంచాయతీ కార్యదర్శి లావణ్య, ఫీల్డ్ అసిస్టెంట్ స్వామి, వివోఏ శోభ, వార్డు సభ్యులు, బీఎల్‌ఓలు, గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -