నవతెలంగాణ – కాగజ్ నగర్
బ్యాటరీ పేలి బాలుడు మృతి చెందిన ఘటన కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు, బాలుడి తలిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలమానెపల్లి మండల పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన నికాడి లోకేష్ (14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడని తెలిపారు. అయితే లోకేష్ కు అప్పుడప్పుడూ బ్యాటరీలతో ప్రయోగాలు చేసే అలవాటు ఉండేదని చెప్పారు. ఈ క్రమంలో బుధవారం నిరుపయోగంగా ఉన్న ఓ బ్యాటరీని నోటితో కొరికే ప్రయత్నం చేయగా అది ఒక్కసారిగా పేలి తీవ్ర గాయాలపాలయ్యడని తెలిపారు. చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించే లోపే మార్గమధ్యలో మృతి చెందాడని లోకేష్ తలిదండ్రులు రమేష్ – శారద బోరున విలపిస్తూ చెప్పారు. వీరికి ఇద్దరు కుమారులుండగా.. లోకేష్ పెద్దవాడని వెల్లడించారు. ప్రస్తుతం బాలుడి మృతితో గూడెం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.
బ్యాటరీ పేలి బాలుడు మృతి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



