నవతెలంగాణ-కుభీర్
మండలంలోని పార్డి (కే) గ్రామంలో రాజరాజేశ్వర కల్యాణ మండప నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం రూ.40 లక్షలు నిధులు మంజూరు చేసిందని మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తన చేతుల మీదుగా ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేశారు. ఈ సందర్భంగా విఠల్ రెడ్డి మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఉన్న అన్ని గ్రామాలలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న పనులను పేద మధ్యతరగతి ప్రజలకు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అరులైన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసి, పనులను ప్రారంభించామని గుర్తు చేశారు. మొదటి విడతలో దాదాపుగా 60 శాతం నిర్మాణ పనులు పూర్తయ్యాయని, రెండో విడతలో గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కళ్యాణ మండపంతో పాటు నూతన మందిరాలు, మరిన్ని కల్యాణ మండపాల నిర్మాణాలకు నిధులు మంజూరుకు శాయశక్తులా కృషి చేస్తానని చెప్పారు. గ్రామాల అభివృద్ధే తమ ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. వెంటనే నూతన భవనాల నిర్మాణ పనులు చేపట్టాలని ఆయన స్తానిక నాయకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ పిఎసిఎస్ చైర్మన్ దొంతుల రాములు, మాజీ సర్పంచ్ గంగాధర్, గ్రామస్తులు సాయినాథ్, రవికుమార్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు.
రాజరాజేశ్వర కళ్యాణ మండప నిర్మాణానికి రూ. 40 లక్షల మంజూరు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



