Sunday, March 15, 2026
E-PAPER
Homeఖమ్మంపారిశుద్ధ్య కార్మికుడు నిజమైన ప్రజా సేవకుడు 

పారిశుద్ధ్య కార్మికుడు నిజమైన ప్రజా సేవకుడు 

- Advertisement -

– ఎంపీఈఓ రామ కోటా రెడ్డి
నవతెలంగాణ – అశ్వారావుపేట 

ప్రజల ఆరోగ్యం, పల్లెలు, పట్టణాల అభివృద్ధి, గ్రామాల పరిశుభ్రత అన్నీ పారిశుద్ధ్య కార్మికుల కష్టం పైనే ఆధారపడి ఉంటాయి అని, పౌరసమాజానికి వారు చేసే సేవలు ఎంతో అమూల్యమైనవి అందుకే నిజమైన ప్రజా సేవకుడు పారిశుద్ధ్య కార్మికులేని ఎంపీవో రామ కోటా రెడ్డి అభిప్రాయపడ్డారు.  99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా ఆదివారం పంచాయతీ రాజ్ ,గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం కోసం పలు సంక్షేమ చర్యలు చేపట్టారు.

మండలంలోని 27 పంచాయతీల్లో నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ ప్రజాపాలనలో ప్రగతి సాధించాలంటే ముందుగా పారిశుద్ధ్య వ్యవస్థ బలంగా ఉండాలన్నారు. ప్రజల ఆరోగ్య రక్షకులుగా చెత్త తొలగించడం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా కాపాడుతారని, పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణం గ్రామాలు, పట్టణాలు శుభ్రంగా ఉండటానికి వారు ప్రధాన కారణం అన్నారు. పర్యావరణ పరిరక్షణ, చెత్తను సక్రమంగా నిర్వహించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గిస్తారని, ప్రజాసేవలో ముందుండే సైనికులు అని అభివర్ణించారు.

వర్షం, ఎండ అనే తేడా లేకుండా తమ విధులు నిర్వర్తిస్తారని, స్వచ్ఛ భారత్ లక్ష్య సాధనలో భాగస్వాములై దేశ పరిశుభ్రత కార్యక్రమాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. తగిన వేతనం, భద్రత కల్పించడం ,అవసరం అయిన పరికరాలు ఇవ్వడం, ఆరోగ్య బీమా కల్పించడం,వారి సేవలను ప్రజలు గౌరవించడం,సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా నే వారికి గౌరవించడం అవుతుంది అన్నారు. పారిశుద్ధ్య కార్మికులు లేకపోతే సమాజం సజావుగా నడవదని,వారి సేవలను గుర్తించి గౌరవించడం ప్రతి పౌరుడి బాధ్యత అని కావున పారిశుద్ధ్య కార్మికుడే సమాజానికి నిజమైన ప్రజా సేవకుడు అని తెలిపారు. అనంతరం పలు పంచాయతీ ల్లో వారిని సన్మానించి, మాస్క్ లు, బూట్లు,వాటర్ బాటిల్స్ అందజేసారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -