- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే, వరుస ఫ్లాపులతో అవకాశాలు కోల్పోయింది. మూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, ఆమెకు మాస్ రాజా రవితేజ, శ్రీ విష్ణు నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రంలో అవకాశం వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. ‘రాజ రాజ చోర’, ‘శ్వాగ్’ చిత్రాల ఫేమ్ హాసిత్ గోలి దర్శకత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో రానున్న ఈ సినిమాలో రవితేజకు జోడీగా పూజా హెగ్డేను ఫైనలైజ్ చేసినట్లు సమాచారం. ఈ సినిమా ఆమె కెరీర్‌కు మళ్లీ బిగ్ టర్నింగ్ పాయింట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
- Advertisement -



