Thursday, July 23, 2026
E-PAPER
Homeజాతీయంనదిపై ఉన్న వంతెనను పేల్చేసిన మిలిటెంట్లు..

నదిపై ఉన్న వంతెనను పేల్చేసిన మిలిటెంట్లు..

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : మణిపూర్‌లోని కామ్‌జోంగ్ జిల్లాలో మిలిటెంట్లు దారుణానికి తెగబడ్డారు. ఫాంగే, చాట్రిక్ గ్రామాల మధ్య లోక్ నదిపై నిర్మించిన ఓ వంతెనను బుధవారం ఉదయం పేల్చివేశారు. ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజ్‌(ఐఈడీ)ని వినియోగించి ఈ బ్రిడ్జిని పేల్చినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పలు గ్రామాలను జిల్లా కేంద్రంతో కలిపే ఈ వంతెనను కూల్చడంతో రాకపోకలకు, నిత్యావసర సేవలకు అంతరాయం కలుగుతోంది. అలాగే టెలికాం శాఖకు చెందిన ఓ వాహనానికి కూడా మిలిటెంట్లు నిప్పంటించారని అధికారులు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -