వెంకటేష్, కల్యాణ్ రామ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్, అర్చన, జీ స్టూడియోస్ సమర్పిస్తున్నాయి. ఈ సినిమా తొలి షెడ్యూల్ విజయవంతంగా పూర్తైంది. ఈ షెడ్యూల్ కోసం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా సెట్ నిర్మించారు. వెంకటేష్, కల్యాణ్ రామ్, కీర్తి సురేష్, కృతి శెట్టి చిత్రీకరణలో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్‌లో కీలకమైన టాకీ పార్ట్‌తో పాటు ఓ అద్భుతమైన పాటను చిత్రీకరించారు. చాలా ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ ఎపిసోడ్స్ సినిమాలో హైలైట్‌గా నిలవనున్నాయి. ఇప్పటికే విడుదల చేసిన కళ్యాణ్ రామ్ పోస్టర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అలాగే అనిల్ రావిపూడి తనదైన క్రియేటివ్ ప్రమోషన్స్ తో ఇప్పటికే అంచనాలు పెంచారు. ఈ చిత్రంలో వెంకటేష్ సరసన కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుండగా, కల్యాణ్ రామ్ సరసన కృతి శెట్టి నటిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ సినిమాకి రచన, దర్శకత్వం: అనిల్ రావిపూడి, నిర్మాత: సాహు గారపాటి, సమర్పణ: సురేష్ ప్రొడక్షన్స్, జీ స్టూడియోస్, అర్చన, సంగీతం: జివి ప్రకాష్ కుమార్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ కృష్ణ, సినిమాటోగ్రాఫర్: సమీర్ రెడ్డి, ఎడిటర్: తమ్మిరాజు.
కీలక తొలి షెడ్యూల్ పూర్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



