నవతెలంగాణ-హైదరాబాద్
నవతెలంగాణ క్రికెట్ టోర్నమెంట్ చాంపియన్‌గా ‘స్టేట్ బ్యూరో’ జట్టు నిలిచింది. నవతెలంగాణ 11వ వార్షికోత్సవ క్రీడా పోటీల్లో భాగంగా గురువారం ఉస్మానియా యూనివర్శిటీ గ్రౌండ్లో జరిగిన ఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ వెబ్సైట్ జట్టుపై స్టేట్ బ్యూరో 20 పరుగుల తేడాతో సాధికారిక విజయం నమోదు చేసింది. తొలుత స్టేట్ బ్యూరో 10 ఓవర్లలో 7 వికెట్లకు 68 పరుగులు చేసింది. ఛేదనలో వెబ్సైట్ టీమ్ 10 ఓవర్లలో 9 వికెట్లకు 48 పరుగులే చేసింది. స్టేట్ బ్యూరో జట్టు తరఫున రాజశేఖర్, భరత్ ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరచగా, వెబ్సైట్ తరఫున ఎలెందర్, ఉపేందర్ ఆకట్టుకున్నారు. క్రికెట్ చాంపియన్‌గా నిలిచిన స్టేట్ బ్యూరో కెప్టెన్ గుడిగ రఘు, జట్టు సభ్యులను సీజీఎం పి. ప్రభాకర్, ఎడిటర్ రాంపల్లి రమేశ్, బ్యూరో చీఫ్ బివిఎన్ పద్మరాజు, హెచ్ఆర్ మేనేజర్ నరేందర్ రెడ్డి అభినందించారు.
ఉరకలేసిన క్రీడోత్సాహం!
నవతెలంగాణ 11వ వార్షికోత్సవ క్రీడా పోటీల్లో భాగంగా వాలీబాల్ విజేతగా హైదరాబాద్ (రిపోర్టర్స్) జట్టు నిలిచింది. ఫైనల్లో జనరల్ డెస్క్ టీమ్‌పై రిపోర్టర్స్ జట్టు గెలుపొందింది. హోరాహోరీగా సాగిన కబడ్డీ పోటీల్లో హైదరాబాద్ (డెస్క్) విజేతగా అవతరించగా, ఎన్టిపీపీ (ప్రింటింగ్) రన్నరప్‌తో సరిపెట్టుకుంది.
క్రికెట్ చాంపియన్ స్టేట్ బ్యూరో
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



