Friday, July 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంఅసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి

అసెంబ్లీ పునరుద్ధరణ పనుల వేగం పెంచాలి

- Advertisement -

పరిశీలించిన సీఎం రేవంత్‌రెడ్డి స్పీకర్‌ ప్రసాద్‌‌కుమార్‌ సమక్షంలో సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌
చారిత్రక ప్రాముఖ్యత కలిగిన అసెంబ్లీ భవనంలో పునరుద్ధరణ, మరమ్మతులకు సంబంధించిన పనులను ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి పరిశీలించారు. గురువారం హైదరాబాద్‌‌లోని శాసనసభ, శాసన మండలి సంయుక్త భవనాన్ని సందర్శించారు. గత కొంతకాలంగా ఆగాఖాన్‌ ‌ట్రస్ట్‌ , రోడ్లు, భవనాల శాఖ సంయుక్తంగా చేపట్టిన పునురు ద్ధణ పనుల గురించి సీఎం ఈ సందర్భం గా అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జరిగిన పనులు, ఇంకా జరగాల్సిన వాటిపై ఆరా తీశారు. పలు సూచనలు చేశారు. ఈ మరమ్మతుల కోసం రూ. 30 కోట్లు కేటాయించినట్టు సమాచారం. ఇందులో కొంత మొత్తాన్ని ఆగాఖాన్‌ ‌ట్రస్ట్‌, మరికొంత రాష్ట్ర ప్రభుత్వం భరిస్తున్నట్టు సమాచారం. ప్రాంగణం మొత్తం తిరిగిన సీఎం పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అసెంబ్లీ భవనం లోపలా, బయట చుట్టూతా కలియతిరిగారు. గాంధీ విగ్రహం పరిసరాలను పరిశీలించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలుగుదేశం కార్యాలయం వైపు జరుగుతున్న పనులనూ తనిఖీ చేశారు. స్పీకర్‌ ‌గడ్డం ప్రసాద్‌‌కుమార్‌ ‌సమక్షంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.

దాదాపు రెండు గంటల పాటు అసెంబ్లీలో గడిపారు. పనులకు సంబంధించి పురోగతిపై వర్కింగ్‌ ఏజెన్సీతో కూలంకషంగా మాట్లాడారు. వర్షాకాల అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పనులు యుద్ధప్రాతిపదికన పూర్తయ్యేలా చూడాలని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి, మండలి కార్యదర్శి నరసింహచారిని ఆదేశించినట్టు సమాచారం. అసెంబ్లీ, మండలి మధ్యలో సెంట్రల్‌ ‌హాల్‌ పనులు సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ పక్కనే ఉన్న కారిడార్‌‌ను పరిశీలించారు. ఈ నెలాఖరులోగానీ, ఆగస్టు మొదటి వారంలోగాని శాసనసభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈలోగానే పునరుద్ధరణ పనులు పూర్తిచేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్‌ ‌తరహా ప్రమాణాలకు అనుగుణంగా హెరిటేజ్‌ ‌భవనంగా అసెంబ్లీని తీర్చిదిద్దాలని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌, ప్రభుత్వ విప్‌‌లు ఆది శ్రీనివాస్‌, అద్దంకి దయాకర్‌, బల్మూరి వెంకట్‌, ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, జైవీర్‌‌రెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో చిట్‌‌చాట్‌ ‌చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -