– కేక్ కట్ చేసి రోగులకు పండ్ల పంపిణీ
– పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర యువ నాయకుడు, మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ ఇన్‌చార్జి మెచ్చా నాగేశ్వరరావు హాజరై నాయకులతో కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా మెచ్చా నాగేశ్వరరావు మాట్లాడుతూ కేటీఆర్ ప్రజాసేవ, అభివృద్ధి పట్ల ఉన్న అంకితభావం యువతకు ఆదర్శమని అన్నారు. నియోజకవర్గ ప్రజల తరఫున కేటీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కుమార మహిపాల్, కోటగిరి సీతారామస్వామి,జేకేవీ రమణరావు, సంక ప్రసాద్, మోహన్ రెడ్డి, కాసాని చంద్రమోహన్, యూఎస్ ప్రకాశ్ రావు, డా. భూక్యా ప్రసాద్, జజ్జూరపు శ్రీరామమూర్తి, సంపూర్ణ, కౌన్సిలర్ కొల్లి రవికిరణ్, మాజీ సర్పంచ్‌లు నారం రాజశేఖర్, సోమిని శివ శంకర ప్రసాద్, తగరం జగన్నాథం, గుడవర్తి వెంకటేశ్వరరావు, చిప్పనపల్లి బజారయ్య, తదితరులు పాల్గొన్నారు.



