నవతెలంగాణ-కోహెడ
ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితులపై రైతులు వరిపంటను తగ్గించి, ఆరుతడి పంటలు వేయాలని సర్పంచ్ బందెల సుజాత బాలకిషన్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని గ్రామపంచాయితి కార్యాలయం వద్ద ఎల్‌నినో పరిస్థితుల ప్రభావం, ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏవో సతీష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగు చేసి ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని రైతులకు సూచించారు. ఒకే పంటపై ఆధారపడే సాగు విధానం వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, ప్రత్యామ్నాయ పంటలతో అధికాదాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కృష్ణయ్య, ఏపీఎం శ్రీనివాస్, పశువైద్యాధికారి మనోహర్, ఏఈవో శివకుమార్, రైతులు పాల్గొన్నారు.
ఎల్‌నినో ప్రభావంపై అవగాహన
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



